Monday, December 6, 2021

వేదములే నీ నివాసమట - Vedamule

వేదములే నీ నివాసమట విమలనారసింహా
నాదప్రియ సకలలోకపతి నమో నమో నరసింహా

ఘోరపాతక నిరుహరణ కుటిలదైత్యదమనా
నారాయణ రమాధినాయక నగధర నరసింహా
నీరూపం బింత యంత యని నిజము దెలియరాదు
యీరీతిఁ ద్రివిక్రమాకృతి నేచితి నరసింహా

గోవిందా గుణగుణరహితా కోటిసూర్యతేజా
శ్రీ వల్లభ పురాణపురుషా శితనఖ నరసింహా
దేవ మిము బ్రహ్మాదులకును తెలియ నలవి గాదు
భావించఁగ ప్రహ్లాదు నెదుటఁ బరగితి నరసింహా

దాసపరికరసులభ తపనచంద్రనేత్రా
వాసవసురముఖముని సేవిత వందిత నరసింహా
భాసురముగ శ్రీ వేంకట గిరిఁ బాయనిదైవము వటుగానా
వోసర కిపు డేగితి విట్ల నహోబల నరసింహా 

Visit for Audio - https://youtu.be/W7vGYKDb6MY 

No comments:

Post a Comment